బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు తీరం నుంచి సముద్రంలోకి మొదటి అడుగులు వేసిన క్షణం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బారువా బీచ్ ఫెస్టివల్‌ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్ర పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ అరుదైన జాతి తాబేళ్ల ఉత్సవాన్ని నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ చిన్న ప్రాణాలను సముద్రంలోకి తీసుకురావడానికి అన్ని విధాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలిపారు. మన గ్రహం యొక్క సహజ అద్భుతాలను రక్షించడం మరియు సురక్షితంగా ఉంచడాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బెందాళం అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, డీఎఫ్‌వో వెంకటేష్, ట్రీ ఫౌండేషన్ సుప్రజా , జిల్లా అటవీ అధికారులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు