శాంతి ఒప్పందంపై అమెరికా కీలక నిర్ణయం..

By Ravi
On
శాంతి ఒప్పందంపై అమెరికా కీలక నిర్ణయం..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా, అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో కూడా ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే వైమానిక దాడులు జరుగుతునే ఉన్నాయి. లేటెస్ట్ గా ఇదే టాపిక్ పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే మీడియేటర్ ప్రయత్నాలు విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇప్పటికీ ట్రంప్ శాంతి ఒప్పందంపై ఆసక్తి కలిగి ఉన్నారని, కాకపోతే ఆయనకు వేరే ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. పారిస్‌ లో యూరోపియన్, ఉక్రెయిన్ నాయకులతో రుబియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రూబియా ఈ కామెంట్స్ చేశారు. శాంతి ఒప్పందంపై ఆసక్తి ఉన్నప్పటికీ ట్రంప్‌కు ఇతర ప్రాధాన్యతలు ఉన్నందున ఆ ప్రయత్నాలు ఆపేస్తామని రూబియో పేర్కొన్నారు.

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..