ప్రపంచ బిలియర్డ్స్‌ టోర్నీలో భారత స్టార్ సౌరవ్..

By Ravi
On
ప్రపంచ బిలియర్డ్స్‌ టోర్నీలో భారత స్టార్ సౌరవ్..

ఐర్లాండ్‌ వేదికగా జరిగిన ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ బిలియర్డ్స్‌ టోర్నీలో భారత స్టార్‌ క్యూయిస్టు సౌరవ్‌ కొతారీ చాంపియన్‌ గా ఘనత సాధించారు. తాజాగా జరిగిన ఫైనల్లో సౌరవ్‌ 725-480 పాయింట్ల తేడాతో ఏస్‌ క్యూయిస్టు పంకజ్‌ అద్వానీపై అద్భుత విజయం అందుకున్నాడు. రీసెంట్ చాంపియన్‌షిప్‌ చరిత్రను పరిశీలిస్తే.. ఏకంగా 325 పాయింట్లతో సౌరవ్‌ అద్భుతమైన బ్రేక్‌ సాధించాడు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వని సౌరవ్‌ 119, 112 స్కోర్లతో గేమ్‌ పై పట్టు నిలబెట్టుకున్నాడు. 

ఇక తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐబీఎస్‌ఎఫ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సరిగ్గా 35 ఏండ్ల క్రితం సౌరవ్‌ తండ్రి, దిగ్గజ క్యూయిస్టు మనోజ్‌ కొతారీ ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఐబీఎస్‌ఎఫ్‌ టైటిల్‌తో పాటు డబ్ల్యూబీఎల్‌ వరల్డ్‌ బిలియర్డ్స్‌ టైటిళ్లు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సౌరవ్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దీంతో ఇండియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

Latest News

అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
విజయనగరం TPN : పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు ఇల్లు కాలిపోవడంతో పాటు  పెళ్లి కోసం సమకూర్చుకున్న నగదు కాలిపోయిన  కుటుంబానికి అండగా...
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌