అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి రివ్యూ ఎలా ఉందో చూద్దాం. వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తోంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్. అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని చేయాలనేది ఆమె లక్ష్యం. ఐతే, పరిస్థితులు అర్జున్ ను హంతకుడిని చేస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు.
వైల్డ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. కళ్యాణ్ రామ్ నటించిన విధానం అట్రాక్ట్ చేసింది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి క్యారెక్టర్ లో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్ లోనూ ఆమె తన మార్క్ యాక్టింగ్ తో అట్రాక్ట్ చేశారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. కళ్యాణ్ రామ్, విజయశాంతిల యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. అలాగే కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేస్తోంది.