కాశ్మీర్‌ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

By Ravi
On
కాశ్మీర్‌ పై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

ఇండియాపై పాకిస్తాన్ కు మొదట్నుండి సరైన అభిప్రాయం లేదు. మరోసారి ఆ దేశం ఇండియాపై అక్కసు వెళ్లగక్కింది. కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి స్పీచ్ ఇస్తూ.. అసిమ్ మునీర్ కాశ్మీర్ టాపిక్ ను హైలెట్ చేశారు. కాశ్మీర్ తమ జీవనాడి అని, దాన్ని మర్చిపోలేమని కామెంట్ చేశారు. విదేశాల్లో ఉన్నవారంతా దేశ రాయబారులు అని, ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందిన వారు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. 

అంతేకాకుండా మీ పిల్లలకు సైతం మన దేశ చరిత్రను, గొప్పతనాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయాలని, హిందువులతో పోల్చుకుంటే, మనం చాలా భిన్నమైన వారమని వారికి ఖచ్చితంగా బోధించాలని అన్నారు. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం అని ఈ సంధర్భంగా అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఈ విషయాలు మీ పిల్లలకు తెలియజేయాలన్నారు. కాగా ఈ విషయంపై పలువురు మండిపడుతున్నారు. పిల్లల్లో ఇంకా దేశాల మధ్య బేధాన్ని నూరి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest News

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..! అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
హైదరాబాద్‌ వనస్థలిపురంలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. స్థానిక ఇంజాపూరంలో రోడ్డును ఆక్రమించుకొని చేసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. స్థానికంగా స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ యాజమాన్యం కాలనీ...
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!