రెట్రోకి పూజా హెగ్డే ప్లస్ అవుతుందా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్ లోనే కనిపించింది. బట్ ఆడియన్స్ పూజా నుంచి స్పైసీ లుక్ ను ఆశిస్తున్నారు. అయినా పూజాను ఇలాగే చూపించాలని దర్శకుడు డిసైడ్ కావడంతో బ్యూటీ సైడ్ నుంచి సినిమాకు రావల్సిన బజ్ ఇంకా రాలేదనే టాక్ వినిపిస్తుంది. రెట్రోలో సూర్యకు భార్యగా పూజా హెగ్డేకు పూర్తి హోమ్లీ క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.
నార్మల్ గానే ఈ డైరెక్టర్ మూవీస్ లో హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపించరు. వారికి కూడా స్టోరీలో ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. పేట, నవరస, మహాన్, జిగర్తాండ ఎక్స్ లో హీరోయిన్లు ఇలాగే డీసెంట్ గా చూపించాడు. తన హీరోయిన్స్ ఇలాగే ఉండాలని కార్తీక్ సుబ్బరాజ్ ముందు నుంచి ఫిక్స్ అవుతాడు. అదే ఫాలో అవుతాడు. ఇప్పుడు రెట్రో సినిమాలో కూడా పూజాను ఇలాగే చూపిస్తూ ఉండడంతో ప్రేక్షకులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది. కనీసం ప్రమోషన్స్ లో అయినా పూజా కాస్త కలర్ ఫుల్ గా కనిపిస్తే కొంతలో కొంత రెట్రోకు బజ్ వస్తుందని అంటున్నారు.