ఎన్టీఆర్ పై హాలీవుడ్ యాక్టర్ కామెంట్స్ వైరల్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రజంట్ గ్లోబల్ లెవెల్ లో భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి ముందు తాను చేసిన గ్లోబల్ సెన్సేషనల్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీతో తాను గ్లోబల్ లెవెల్లో మంచి ఫేమ్ ని అందుకున్నాడు. ఇలా ఎంతోమంది హాలీవుడ్ యాక్టర్స్ దర్శకులు కూడా తారక్ పై కామెంట్స్ చేయడం జరిగింది. మరి లేటెస్ట్ గా హాలీవుడ్ భారీ హిట్ మూవీ బ్లాక్ పాంథర్ యాక్టర్ మైఖేల్ బీ జోర్డాన్ ఎన్టీఆర్ పై తన సిన్నర్స్ ప్రమోషన్స్ లో మాట్లాడారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తనకి ఎన్టీఆర్ కి మధ్య ఆ మధ్య ఆస్కార్స్ లో జరిగిన మాటలు తాను రివీల్ చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆస్కార్స్ సమయంలో ఓ సారి కలిసాను అతనికి బాస్కెట్ బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం అని బ్లాక్ పాంథర్ నటుడు షేర్ చేసుకోవడం ఇపుడు మంచి ఆసక్తిగా మారింది. దీనితో తన కామెంట్స్ ఇపుడు ఎన్టీఆర్ అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఈ విధంగా ఎన్టీఆర్ గ్రేస్ బాలీవుడ్ కు రీచ్ అవ్వడంతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ సైతం మన స్టార్స్ ను గుర్తుచేసుకోవడం ఎంతో గర్వంగా ఉందంటున్నారు నెటిజన్లు.