సన్‌రైజర్స్‌కి తప్పిన ముప్పు.. హుటాహుటీన తరలింపు..!

By Ravi
On
సన్‌రైజర్స్‌కి తప్పిన ముప్పు.. హుటాహుటీన తరలింపు..!

హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్‌-2లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ స్టార్ హోటల్ మొద‌టి అంత‌స్తులో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. దాంతో హోట‌ల్ స్టాఫ్‌, గెస్టులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. భారీగా ఎగసిప‌డిన మంటల కార‌ణంగా ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్మేశాయి. అప్ర‌మ‌త్త‌మైన హోటల్ యాజ‌మాన్యం వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. వారి స‌మాచారంతో ప్ర‌మాదస్థ‌లికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, అగ్నిమాప‌క యంత్రాల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్లు ఆరో అంత‌స్తులో ఉన్నారు. వెంట‌నే ఆట‌గాళ్లు, వారి కుటుంబ‌స‌భ్యులు, స‌పోర్ట్ స్టాఫ్ అక్క‌డి నుంచి బ‌స్సులో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇక ఈ ఐపీఎల్ సీజ‌న్ కోసం గ‌త కొన్నిరోజులుగా స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌తోపాటు జ‌ట్టు మేనేజ్‌మెంట్ ఇక్క‌డే బ‌స చేస్తున్నారు. ఇవాళ్టి సంఘ‌ట‌న కార‌ణంగా వారు వెంట‌నే హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!