చైనాలో గాలుల బీభత్సం.. విమాన సర్వీసులకు బ్రేక్..

By Ravi
On
చైనాలో గాలుల బీభత్సం.. విమాన సర్వీసులకు బ్రేక్..

చైనాలో గాలులు బీభత్సం సృష్టించాయి. తాజాగా నేడు భారీ గాలులు వీచడంతో రాజధాని బీజింగ్‌లో చెట్లు కూలిపోగా.. పాత ఇళ్లులు కూలిపోయాయి. భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా.. పార్కులు మూసేశారు. ఇక భీకర గాలులు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 700 విమాన సర్వీసులు రద్దైనట్లుగా సమాచారం. దీంతో బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

అధికారులు గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చారు. మొదటిసారి ఆరెంజ్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. 1951లో నమోదైన రికార్డులను తాజా తుఫాన్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం విమాన, రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పర్యాటక ప్రాంతాలను మూసేశారు. శుక్రవారం ఢిల్లీలో కూడా భీకరమైన దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. చాలా మంది భూకంపం వచ్చిందేమోనని భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Latest News

కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..! కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..!
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్‌కోట్ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు, పొగలు ఎగసిపడతున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బ్యాంకు సిబ్బంది...
వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు..!
వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
తెగి పడ్డ హైటెన్షన్ వైర్.. చాదర్ ఘాట్ లో భారీగా ట్రాఫిక్ జామ్..!
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!