ల‌క్నోతో మ్యాచ్‌.. గుజ‌రాత్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌

By Ravi
On
ల‌క్నోతో మ్యాచ్‌.. గుజ‌రాత్ ఫ‌స్ట్ బ్యాటింగ్‌

ఐపీఎల్ నుంచి కివీస్ స్టార్ బ్యాట‌ర్ గ్లెన్ ఫిలిప్స్ దూరం అయ్యాడు. గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున క్రికెట్ ఆడుతున్న ఆయన గాయం వ‌ల్ల .. టోర్నీ నుంచి అత‌న్ని త‌ప్పించారు. దీంతో గుజరాత్ జ‌ట్టుకు నష్టం కలగబోతుంది. హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ గాయ‌ప‌డ్డాడు. అత‌ని గ‌జ్జ‌ల్లో గాయ‌మైన‌ట్లు మెడిక‌ల్ సిబ్బంది తెలిపారు. దీంతో అత‌ను న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లాడు. ఇక ఇవాళ లక్నోతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. 

టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ జ‌ట్టు ఫ‌స్ట్ బౌలింగ్ ఎంచుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో మిషెల్ మార్ష్ ఆడ‌డం లేద‌ని ల‌క్నో కెప్టెన్ పంత్ తెలిపారు. మార్ష్ కూతురు ఆరోగ్యం స‌రిగా లేద‌ని, ఆ చిన్నారిని చూసుకునేందుకు అత‌ను మ్యాచ్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలిపాడు. మిచెల్ మార్ష్ స్థానంలో ఢిల్లీ బ్యాట‌ర్ హిమ్మ‌త్ సింగ్ జ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. మరి ఈ గేమ్ లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం