ట్రంప్ టారీఫ్ లపై 90 రోజుల బ్రేక్.. కారణం ఏంటంటే?
ప్రస్తుతం ప్రపంచ దేశాలు రివెంజ్ టారీఫ్ లతో వణుకుతుంది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చైనా తప్ప మిగతా దేశాలపై టారిఫ్ లు అమలు చేయడానికి 90 రోజులు పాటు బ్రేక్ తీసుకున్నారు. ఈ టారీఫ్ లపై ఫస్ట్ నుంచీ అస్సలు తగ్గే ప్రశక్తే లేదంటూ శపథం చేసిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు వాటికి బ్రేక్ ఇచ్చారు అనేది హైలెట్ టాపిక్. అయితే దీనికి కారణం బాండ్ మార్కెట్ అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఏప్రిల్ 2న భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో రివేంజ్ టారీఫ్ లతో విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్.
దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా ఆందోళన పడ్డాయి. అయితే, ఈ టారిఫ్‌ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు సైతం క్రియేట్ అవ్వడంతో అంతర్జాతీయ మాంద్యం రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధనవంతులు అయ్యేందుకు ఇదే సరైన సమయం అంటూ కొంతమంది టారిఫ్‌లను సమర్థించుకున్నారు. ఈవిషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని ట్రంప్ గట్టిగా చెప్పారు. ఆయనకు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా టారిఫ్ లపై బ్రేక్ ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయం వెనక బాండ్ మార్కెట్ ఒక్కటే కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం.