భయంతో భార్యను లవర్ కి ఇచ్చి పెళ్లి చేసిన భర్త
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల తర్వాత భార్యలకు, భర్తలకు లవ్ మ్యారేజ్ లు ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కూడా ఇలాంటి మ్యారేజ్ జరిగింది. అంతేకాకుండా వివాహేతర బంధాలు ఎక్కువవడం, అడ్డుగా ఉన్నారని భర్తల్ని చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదేక్రమంలో ప్రాణ భయంతో ముందుగానే భర్తలు అప్రమత్తం అవుతున్నారు. కోరుకున్న ప్రియుడితోనే భార్యలను ఇచ్చి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో అలాంటి సంఘటన చోటుచేసుకుంది. తన భార్య ఓ యువకుడితో ప్రేమలో పడినట్లుగా భర్త గుర్తించాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా భర్తకు తెలియకుండా ప్రియుడితో తిరుగుతోంది.
ఈ విషయాన్ని గమనించిన భర్త.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే పెద్దల సమక్షంలో భార్యను ప్రియుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరబ్‌ను భార్య, ఆమె ప్రియుడి అత్యంత దారుణంగా హతమార్చారు. బాడీని ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో పూడ్చేశారు. ఈ ఘటన తర్వాత చాలా మంది భార్యలు.. భర్తలను ఇదే తరహాలో హెచ్చరిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.