రక్తపు మడుగులో వ్యక్తి మృతదేహం..
హయత్ నగర్ లో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతదేహం కలకలం రేపుతుంది. రిలయన్స్ డిజిటల్ షోరూమ్ వద్ద వ్యక్తి మృతదేహం రక్తం మడుగులో పడి ఉండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడు హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా పోలీస్ లు గుర్తించారు. నగేష్ రిలయన్స్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు పోలీసులు, అయితే నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకోవడం తో మృతురాలి తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు హయత్ నగర్ పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న నగేష్ ను రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చారు బంధువులు. భార్య ఆత్మహత్య పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో ఎలాగైనా జైలు కి వెళ్లాల్సి వస్తాదన్న భయం తో నగేష్ ఆత్మహత్యా చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాగేష్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు...