తుర్కంజాల్ మున్సిపాలిటీ పరిధి శివాజీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత .
By Ravi
On
ఇబ్రహీంపట్నం తుర్కంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య విభేదాలు చెలరేగి రాళ్లతో దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. శివాజీ నగర్ ఫేస్ 2 240, 241, 242 లో గల ప్లాట్లను1984లో దాదాపు 400 మంది కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో కొందరు బయటి వ్యక్తులు ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవని అవి తమ భూములంటూ ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దీని విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. తెల్లవారుజామున కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయగా ప్లాట్స్ యజమానులు అడ్డుకున్నారు. ఇరువురు మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీయడంతో రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
19 Apr 2025 11:58:47
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...