ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
శేఖర్, టీపీఎన్ కరస్పాండెంట్: బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకొని వారి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. పిచ్చాటూరులో కోనేటి ఆదిమూలంపై అభిమానంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో ఇలా పెద్ద ఎత్తున ఆదిమూలం జన్మదిన వేడుకలను జరపడంతో అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.