బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
By Ravi
On
హైదరాబాద్ పాతబస్తీ ఫతేదర్వాజ ప్రాంతంలో కలకలం రేగింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానని మోసం చేశారంటూ బాధితులంతా ఆస్పత్రికి క్యూ కట్టారు. ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టీసిపెంట్‌కి జుట్టు మొలిపించానంటూ వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశాడు. దీంతో చాలా మంది ఈయన సెలూన్ ముందు క్యూ కట్టారు. వచ్చినవారందరికి వకీల్ గుండు గీసి కెమికల్ రాసి పంపించాడు. తీరా ఇంటికి వెళ్లాక జుట్టు రాకపోగా.. సైడ్ ఎఫెక్ట్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. మరోవైపు కాలాపత్తర్ పోలీసులు మాత్రం ఇంకా తమకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందలేదని.. అందితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
Tags:
Related Posts
Latest News
07 Apr 2025 21:50:31
జీహెచ్ఎమ్‌సీ టౌన్ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...