16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింటన్ కోచ్ అరాచకం
బ్యాడ్మింటన్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిపై కోచ్ దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనలో కోచ్ సురేష్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రెండేళ్ల క్రితం బ్యాడ్మింటన్ అకాడమీలో కోచింగ్ తీసుకునేందుకు ఆమె తల్లి చేర్పించింది. ఈ క్రమంలో కోచ్ ఎన్నో సార్లు తన కూతుర్ని టార్చర్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. కాగా పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత 16 ఏళ్ల బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె అమ్మమ్మ ఫోన్ నుండి న్యూడ్ ఫోటోలను గుర్తు తెలియని నంబర్ కు వాట్సాప్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఫోటోలపై ఆరా తీయగా ఆ అమ్మాయి రేప్ కు గురైన విషయం బయటకు వచ్చింది.
ఆ ఫోటోలును చూసిన అమ్మమ్మ, విషయం మొత్తం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లి నిలదీయగా, జరిగిన విషయం బయట పెట్టింది. బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇస్తున్న కోచ్ ఈ విధంగా ప్రవర్తించాడని, విషయం ఎవరికీ చెప్పవద్దు అని వార్నింగ్ ఇచ్చాడని తెలిపింది. కాగా బాధితురాలి తల్లి కంప్లైంట్ మేరకు పోలీసులు కేస్ ఫైల్ చేశారు. బ్యాడ్మింటన్ కోచ్ తమిళనాడు వ్యక్తిగా గుర్తించి, అతనిపై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. కాగా బాలికపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు విచారణలో కోచ్ అంగీకరించాడు. కాగా అతని ఫోన్ నుంచి పోలీసులు చాలామంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలను గుర్తించారు.