27 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభాయాత్ర
By Ravi
On
హైదరాబాద్ కర్మన్‌ఘాట్ నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై కోఠీ మీదుగా ప్రధాన ర్యాలీతో కలసి తాడ్‌బండ్ వీర హనుమాన్ దేవాలయం వరకు శోభయాత్ర సాగనుంది. హిందువులు ఐక్యత పెంపొందించడానికి, దేవాలయాల వ్యవస్థను, గోమాతను రక్షించుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు స్వామీజీ కమలానంద భారతి తెలిపారు. ఈ శోభాయాత్ర భాగ్యనగర్ సంస్కృతికి ప్రతీక అని శశిధర్ తెలిపారు. దేశద్రోహులకు, మతోన్మాద వ్యక్తులకు భారతదేశంలో స్థానం లేదన్నారు. లక్షలాది మంది హిందూ బంధువులు వీర హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...