ఫన్ సీన్స్ షెడ్యూల్ లో బిజీగా జైలర్ 2
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా రజనీకాంత్ యాక్ట్ చేసిన జైలర్ కు సీక్వెల్ ను ఇప్పుడు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి రజనీకాంత్ ఈ సినిమాను షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తో కలిసి కూలీ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమాను కంప్లీట్ చేశారు. ఇప్పుడు జైలర్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ప్రజంట్ ఈ షూటింగ్ షెడ్యూల్ లో కామెడీ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ ఫ్యామిలీ సీన్స్ లో మనవడు, రమ్యకృష్ణలపైనే ఈ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. జైలర్ మూవీ యాక్షన్ అండ్ ఎంటర్ టైనింగ్ గా నిలిచాయి. మరి ఇప్పుడు ఈ సినిమా ఫన్ కూడా యాడ్ అవ్వడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.