చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి

By Ravi
On
చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి

25 మంది చేనేత కార్మికులకు సోలార్ యూనిట్లు పంపిణీ

Kukkala Govinda Raju.TPN
Ramachandrapuram
 

కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మంజూరైన సోలార్ యూనిట్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్  తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వాసంశెట్టి సత్యం  పంపిణీ చేశారు.

ఆదివారపుపేటలోని శ్రీ శివ బాలయోగి మహారాజ్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గురువారం జరిగింది. చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తుందని, ఈ స్కీం ద్వారా ఇప్పటికే జాకాడ మోటర్లు, మిషన్లు మంత్రి సుభాష్ చే గతంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

సోలార్ యూనిట్లు పంపిణీ ద్వారా విద్యుత్ అంతరాయం ఉన్న సమయంలో కూడా నేత పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని  సత్యం గారు  వెల్లడించారు. నేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ అధికారులు, కూటమి నాయకులు, చేనేత కార్మికులు  పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...