మండపేట పట్టణ శెట్టిబలిజ సంఘం నూతన అధ్యక్షునిగా బండి గోవిందు ఏకగ్రీవం..
MAHESH, MANDAPETA, TPN
మండపేట పట్టణ శెట్టి బలిజ సంఘం నూతన అధ్యక్షునిగా బండి గోవిందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక శెట్టిబలిజ కళ్యాణ మండపంలో బుధవారం మండపేట పట్టణ పది సంఘాల నూతన కార్యవర్గం ఏర్పాటుకు సభ్యులు సమావేశం నిర్వహించి అధ్యక్షులుగా బండి గోవిందు,ఉపాధ్యక్షులుగా పెంకే వెంకట్రావు, సెక్రటరీగా కుక్కల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పంపన శ్రీనివాస, జాయింట్ సెక్రెటరీ కడలి నాగ దుర్గారావు, ట్రెజరర్ కుక్కల శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. పూర్వపు అధ్యక్షులు పంపన శ్రీనివాస్ ను సంఘ సభ్యులు పూలమాలలుసాలువతో సత్కరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను సంఘ పెద్దలు పూలమాలలతో సత్కరించారు.గోవిందు మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.సంఘంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కారానికి పాటు పడతానన్నారు. నూతనంగా ఎన్నికైన బండి గోవిందు కు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ లు గుత్తుల గోవిందు, చొల్లంగి గోవిందు,నామాల చందర్రావు, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, మాజీ సొసైటీ అధ్యక్షులు పెంకె గంగాధర్, కుక్కల రామారావు, చింతపల్లి రామకృష్ణ,ముసిని శ్రీనివాసరావు, పట్టణ 10 సంఘాల పెద్దలు సభ్యులు పాల్గొన్నారు.