శ్రీకాకుళం పట్టణంలో రోడ్స్, డ్రైనేజీ పరిశీలన - ఎమ్మెల్యే గోండు శంకర్
By Ravi
On
శ్రీకాకుళం పట్టణం: శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం 2 విశాఖ ఏ కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గొండు శంకర్ రోడ్స్ మరియు డ్రైనేజీ వ్యవస్థపై పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను సకాలంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇలా కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గోండు శంకర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్ల నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...