"అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం - ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి"

By Ravi
On

WhatsApp Image 2025-03-26 at 6.32.00 PMపోలాకి, మార్చి 26:

ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి  తెలిపారు. ఈ రోజు కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, నియోజకవర్గంలో కొనసాగుతున్న గృహనిర్మాణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, "గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అందులో ఏమైనా సమస్యలు వస్తే, వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని" అన్నారు.

ఆయన మాట్లాడుతూ, "అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహం మంజూరు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ పథకాల కింద బిసి, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 50000, 75000, మరియు లక్ష రూపాయల అదనపు సాయం అందించడం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు" అని అన్నారు.

ఆయన ఇంకా, "డిమాండ్ సర్వే ఈ నెల చివరితో ముగియనుంది. అర్హులైన లబ్ధిదారులు త్వరగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు."

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ, నాలుగు మండలాల ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!