మతసామరస్యం, ఆత్మీయతకు ప్రతిక ఇఫ్తార్ విందు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

By Ravi
On
మతసామరస్యం, ఆత్మీయతకు ప్రతిక ఇఫ్తార్ విందు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Screenshot 2025-03-25 211231గుడివాడ (మార్చి 24): గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గుడివాడ పట్టణంలోని నైజాంపేటలోని నూర్ మసీదు లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ విందు మతసామరస్యాన్ని పెంచడానికి, ఆత్మీయతను అభివృద్ధి చేసేందుకు ప్రతికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

మసీదులో ప్రార్థనల అనంతరం, ముస్లిం సోదరులను ఎమెల్యే రాము ఆలింగనం చేసుకొని, వారితో కలిసి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలు పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తిశ్రద్ధతో ఉంటాయని, ఈ పవిత్ర సమయాన్ని ప్రార్థనలతో గడపడం తనకు సంతోషకరమని అన్నారు.

ఎమెల్యే రాము మాట్లాడుతూ, "రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతికగా నిలుస్తుంది. ఇఫ్తార్ విందు ద్వారా ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుంది. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.WhatsApp Image 2025-03-25 at 9.30.47 AM

ముస్లింలు రంజాన్ పండుగను అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు, దీని ద్వారా మత సామరస్యానికి ప్రోత్సాహం లభిస్తుందని ఎమెల్యే రాము అన్నారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్టణం టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మైనార్టీ పెద్దలు షేక్ ఇబ్రహీం, షేక్ సర్కార్, షేక్ మౌలాలి, సయ్యద్ జబీన్, మహమ్మద్ రఫీ, అబ్దుల్ మున్వర్, మహమ్మద్ నూర్, కరీముల్లా, నూర్ బచ్చా రబ్బాని, సయ్యద్ గఫార్, టిడిపి నాయకులు లింగం ప్రసాద్, చెకూరు జగన్మోహన్రావు, గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, మియాఖాన్ మసీదు అధ్యక్షుడు మహమ్మద్ వలి మరియు నూరు మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఎమెల్యే రాము ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.

Tags:

Advertisement

Latest News

లవ్ మ్యారేజ్.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు లవ్ మ్యారేజ్.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు
ఈ మధ్య కాలంలో దేశంలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిపోయింది. భార్యభర్తలు చంపుకోవడం, వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని పిల్లల్ని కడతేర్చడం.. లేదా భార్యభర్తలు చిన్నచిన్న కారణాలతో...
షారూఖ్ కూతురికి తల్లిగా దీపిక?
అఫిషీయల్.. హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ 
ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ: పంజర్లి
నాని హిట్‌ 3 నుంచి లీక్స్‌.. డైరెక్టర్ కామెంట్స్
దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు లో నిందితులకు ఉరి శిక్ష..
మురిపించిన ముంబై.. అదరగొట్టిన ఆర్సీబీ..