బాలానగర్ లో హిట్ అండ్ రన్.. యువతికి గాయాలు

By Ravi
On
బాలానగర్ లో హిట్ అండ్ రన్.. యువతికి గాయాలు

 

హైదరాబాద్, 25 మార్చి 2025:
బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ చౌరస్తా వద్ద జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో మద్యం మత్తులో ఉన్న సాయి కీర్తి (19) అనే యువతిని ఫార్చునర్ కారు ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే కారు అతివేగంతో వెళ్ళిపోవడంతో, సిగ్నల్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఫతే నగర్ సిగ్నల్ వద్ద ఉన్న పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే కారును ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రారంభ విచారణలో నిందితుడు గోగం అనిల్ (35), బల్కం పెట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్ లో విందు హాజరయ్యి, ఉదయం తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!