రుణమాఫీ అమలు కోసం చేసిన కొట్లాట మాకోసం కూడా చేయండి..

By Ravi
On
రుణమాఫీ అమలు కోసం చేసిన కొట్లాట మాకోసం కూడా చేయండి..

ఎన్నికల ముందు 12వేలని నమ్మించారు.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు..

మా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి 

మాజీ మంత్రి హరీష్ రావుకు ఆటో యూనియన్ నాయకుల వినతి

రుణమాఫీ అమలు కోసం ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నారో.. అదేవిధంగా తమ ప్రయోజనాల కోసం పోరాడాలని ఆటో యూనియన్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కోరారు.

శనివారం హరీష్ రావును కలిసి ఆటో యూనియన్ నాయకులు వారు పడుతున్న కష్టాలు, ఆవేదన గురించి చెప్పుకున్నారు. 

మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు చేయకుండా, ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు.

అధికారంలోకి వస్తే 12 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 15 నెలలు గడుస్తున్నా 15 రూపాయలు కూడా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. 

బడ్జెట్లో ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఊసు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేదని అన్నారు. 

ఆర్థిక సమస్యలతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.

కాబట్టి, ఆటో డ్రైవర్ల సమస్యలను, వారి బతుకులను దృష్టిలో పెట్టుకొని, 12000 ఆర్థిక సాయం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో నిలదీయాలని, అమలు అయ్యేదాకా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మీ సమస్యలపై తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతానని, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన 12 వేల ఆర్థిక సాయం సహా, ఇతర అన్ని హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టబోమని మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. 

ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బిఆర్ఎస్ పార్టీ ఎల్లపుడూ అండగా ఉంటుందని ఆటో యూనియన్ నాయకులకు ధైర్యం చెప్పారు.Screenshot 2025-03-22 131050

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..