మార్చి 24 న దేశవ్యాప్తంగా పార్లమెంట్ ముట్టడికి NSUI సిద్ధం
నేషనల్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా (NSUI) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట స్వామి గాంధీ భవన్ లో మార్చి 24 న పార్లమెంట్ ముట్టడి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం UGC బిల్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు."మా లక్ష్యం, మోడీ ప్రభుత్వం UGCC బిల్‌ను వెంటనే వెనక్కి తీసుకోవడం. అందుకే మార్చి 24 న NSUI ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. తెలంగాణ నుండి 400 మంది డిల్లికి వెళ్ళిపోతున్నారు," అని ఆయన తెలిపారు.అలాగే, "బీజేపీ యూజీసీని తమ గడపలో ఉంచుకోవాలని చూస్తోంది. కులగణన జరిగిన తర్వాత రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ తీసుకరావడం చరిత్రలో గొప్ప నిర్ణయమైంది," అని ఆయన అన్నారు."ఎస్సీ వర్గీకరణను చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో నిలిచారు," అని వెంకట స్వామి పేర్కొన్నారు. "మోడీ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేశాడు. యువ వికాసం పథకాన్ని అన్ని యూనివర్సిటీలకు, కాలేజీలకు తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికను రూపొందించాం," అని ఆయన తెలిపారు."ప్రభుత్వ పథకాలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్‌లను అందించే విధంగా కృషి చేస్తున్నాం. ఓయూ లో మనువాదులు తీసుకున్న ప్రజా ప్రభుత్వం పై సర్కులర్‌ను NSUI వ్యతిరేకిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యాలయాలలో ఎన్నికలు జరగాలి," అని ఆయన చెప్పారు."విద్యార్థులలో చైతన్యం తీసుకరావాలని NSUI ముందుకు పోతుంది," అని వెంకట స్వామి అన్నారు."NSUI జై భీం, జై బాపు, జై సంస్కృతం ను గ్రామ గ్రామానికి తీసుకుపోతుంది," అని ఆయన స్పష్టం చేశారు."పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో చర్చించి, 11 వేల కోట్లను గురుకులాలకు బడ్జెట్‌లో కేటాయించడం చాలా సంతోషకరం," అని వెంకట స్వామి అన్నారు."58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రభుత్వం నిర్మించనుంది," అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో NSUI యువత, విద్యార్థుల సంక్షేమానికి అంకితమై, మోసపోయిన యువతకు ఆకాంక్షలు ఇచ్చేందుకు పోరాటం కొనసాగిస్తోంది.