గత ఐదేళ్లలో 3,191 మందికి ఎన్ఎమ్‌డీఎఫ్‌సి రుణాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ

By Ravi
On
గత ఐదేళ్లలో 3,191 మందికి ఎన్ఎమ్‌డీఎఫ్‌సి రుణాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ

  • కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్ల‌డి .
  • జాతీయ మైనారిటీల అభివృద్ధి ,ఫైనాన్స్ కార్పొరేషన్ పై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

ఢిల్లీ : గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్రప్రదేశ్‌లో 3,191 మంది లబ్ధిదారులకు మాత్ర‌మే జాతీయ మైనారిటీల అభివృద్ధి ,ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC)   పథకాల ద్వారా రుణాలు అందించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSMFC) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మైనారిటీల అభివృద్ధి ,ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC) పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీ (SCA) గా వ్యవహరిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2008-09 లో అప్ప‌టి రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఎ.పి.ఎస్.ఎమ్.ఎఫ్‌.సి ద్వారా ఎన్.ఎమ్.డి.ఎఫ్.సి ప‌థ‌కాల‌ను నిలిపివేసింది. ఆనాటి రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా గ్రాంట్ ఆధారిత ప‌థ‌కాల‌పై దృష్టి సారించింది. ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఎ.పి.ఎస్.ఎమ్.ఎఫ్‌.సి ను ఎన్.ఎమ్.డి.ఎఫ్‌.సి ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌టానికి నియ‌మించింద‌ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్ల‌డించారు. గ‌త ఐదేళ్ల‌లో ఎపిలో జాతీయ మైనారిటీల అభివృద్ధి ,ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ల‌బ్ధి పొందిన ల‌బ్ధిదారుల వివ‌రాలు,ఆ ప‌థ‌కానికి కేటాయించిన నిధులు గురించి, ప్ర‌భుత్వ విద్యా రుణ ప‌థ‌కంలో క్రెడిట్ లైన్ -1, క్రెడిట్ లైన్ -2 ల‌బ్ధిదారుల డేటా తెలియ‌ప‌ర్చాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ లోక్ సభలో బుధ‌వారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ‌ను అడ‌గ‌టం జ‌రిగింది. వీటికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.గ‌త ఐదేళ్ల‌లో ఎన్.ఎమ్.డి.ఎఫ్‌.సి ద్వారా దేశవ్యాప్తంగా రూ. 3,600.21 కోట్ల నిధులు విడుద‌ల చేయ‌గా  ఎపికి  రూ. 9.68 కోట్లు విడుద‌ల చేసినట్లు తెలిపారు.  ఎన్.ఎమ్.డి.ఎఫ్‌.సి ద్వారా విద్యా రుణాలను  2015-16 నుండి 2024-25 వరకు క్రెడిట్ లైన్-1 & క్రెడిట్ లైన్-2 ద్వారా  రూ. 313.49 కోట్లు  18,654 లబ్ధిదారుల కి పంపిణీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం