సెమీఫైనల్ కు ముందు టీం ఇండియాకు బ్యాడ్ న్యూస్

సెమీఫైనల్ కు ముందు ఇండియాకు బ్యాడ్ న్యూస్! తల్లి మరణంతో ఇంటికి తిరిగి వెళ్లనున్న టీం మెంబర్!
భారత క్రికెట్ జట్టు మేనేజర్ ఆర్. దేవరాజ్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మధ్యలోనే తల్లి మరణం కారణంగా జట్టును వీడారు. ఈ ఘటన భారత జట్టు సన్నాహకాల్లో మార్పుకు దారితీసే అవకాశం ఉంది.న్యూజిలాండ్‌పై కీలక విజయంతో సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు, ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే మేనేజర్ తిరిగి జట్టులో చేరుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మేనేజర్ ఆర్. దేవరాజ్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జట్టును వీడారు. ఆదివారం ఆయన తల్లి కమలేశ్వరి గారు మరణించడంతో తక్షణమే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శిగా ఉన్న దేవరాజ్, భారత జట్టుతో దుబాయ్‌లో ఉన్నప్పటికీ, మేనేజర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Related Posts
Latest News
