వరంగల్ లో డిసిఏ అధికారుల దాడి.. లైసెన్స్ లేని మందుల షాప్ సీజ్..
By Ravi
On
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి దాడులు జరిపోయారు. అక్రమ మందుల విక్రయాలు చేస్తున్నారని వరంగల్‌లో గిర్మాజిపేటలో ఉన్న ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో సాయికిరణ్ పాల్ట్రి అండ్ వెట్ మెడికల్స్ అనే మెడికల్ షాప్‌పై దాడి నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల మందుల నిల్వ లేదా అమ్మకాలు జరపాలంటే ప్రతి స్థలానికి ప్రత్యేక లైసెన్సు అవసరమని, అయితే సాయికిరణ్ పాల్ట్రి అండ్ వెట్ మెడికల్స్ యాజమాన్యం డ్రగ్ లైసెన్సు లేకుండా అక్రమంగా మెడికల్ షాప్‌ను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. దాడి సందర్భంగా అధికారులు పెద్ద మొత్తంలో వెటర్నరీ మందులు నిల్వ ఉంచినదాన్ని గుర్తించారు. మొత్తం 26 రకాల వెటర్నరీ మందులు స్టాక్‌లో ఉండగా, వాటి విలువ రూ. 2.5 లక్షలు అని అంచనా వేసి స్వాధీనం చేసుకున్నారు.
Latest News
08 Jun 2025 22:39:32
తిరుపతి జిల్లా – సూళ్లూరుపేట, 2025 జూన్ 8
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కించపరిచేలా వచ్చిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే...