అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య

By Ravi
On
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య


అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానిక ప్రాంతానికి చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులను హత్య చేశారు అంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేశారు. గాఢ నిద్రలో ఉన్న దంపతులను కర్రలతో దాడి చేసి దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. కనకయ్య వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. బంగారం కోసం దోపిడీ  దొంగలు హత్య చేశారా లేక పాతకక్షల నేపధ్యంలో హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement