మహేశ్వరం జోన్‌లో 855 సీసీ కెమెరాలను ప్రారంభించిన కమిషనర్‌ సుధీర్‌బాబు..!

By Ravi
On
మహేశ్వరం జోన్‌లో 855 సీసీ కెమెరాలను ప్రారంభించిన కమిషనర్‌ సుధీర్‌బాబు..!

హైదరాబాద్‌ మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 855 సీసీ కెమెరాలను రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో 855 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు క్రైమ్ ఫ్రీ సీటీలో భాగంగా మహేశ్వరం జోన్‌లోని 136 దేవాలయాల్లో 550 కెమెరాలు, 289 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వంద మంది పోలీస్‌లు చేసే పనిని ఒక సీసీ కెమెరా చేస్తుందని.. క్రైమ్ కేసులో తొందరగా డిటేక్ట్ చేయడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మహిళల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని గుర్తుచేశారు. ఈ ఏడాదిలో 57 ముఖ్యమైన కేసుల్లో సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, మహేశ్వరం జోన్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, అధికారులు, నాయకులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బొర్రా జగన్ రెడ్డి,పెద్దబావి సుదర్శన్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి