ట్రంప్‌, జెలెన్‌ స్కీ ల మధ్య భేటీ.. 

By Ravi
On
ట్రంప్‌, జెలెన్‌ స్కీ ల మధ్య భేటీ.. 

వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ లో ఈరోజు పోప్‌ ఫ్రాన్సిస్‌ అంతిమయాత్ర ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 164 మంది హాజరయ్యారు. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్, మెక్రాన్, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తదితరులు ఇందులో ఉన్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కాసేపు సమావేశమయినట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్ధం ముగింపు.. ఖనిజాల ఒప్పందం మొదలైన విషయాల గురించి వారు చర్చించినట్టు.. ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని అధ్యక్ష కార్యాలయాలు తెలిపాయి.

అంతేకాకుండా అమెరికాలోని ఓవల్‌ కార్యాలయంలో ట్రంప్‌నకు, జెలెన్‌స్కీకి వాగ్వాదం జరిగిన తర్వాత వారు కలవడం ఇదే మొదటి సారి. ఇటీవల యుద్ధం ముగింపు గురించి ట్రంప్‌ మాట్లాడుతూ..ఈ వారంలోనే ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం పొందింది. అయితే పోప్‌ అంత్యక్రియల కార్యక్రమంలో వీరిద్దరు ఒకే దగ్గర కూర్చోకపోవడంతో వీరి మధ్య ఇంకా మనస్పర్థలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి