అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్..

By Ravi
On
అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్..

అమెరికాలో ట్రంప్‌ టీమ్ 133 మంది విద్యార్థులకు నిలిపేసిన స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. దీనిలో చాలా మంది భారత్‌ కు చెందినవారున్నారు. అమెరికా విదేశాంగశాఖ వీరి వీసాలను రద్దు చేయడంతోపాటు ఎస్‌ఈవీఐఎస్‌ను టెర్మినేట్‌ చేయడంపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడి ప్రభుత్వ ఏజెన్సీల వాదన డిఫరెంట్ గా ఉంది. ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల దృష్టిలోపడ్డారని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తాము తాత్కాలికంగా అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెబుతున్నాయి. కానీ, ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు. ఇక ఇమిగ్రేషన్‌ లాయర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు. 

దీంతో విద్యార్థులు ఏ నేరాలు చేయకపోయినా.. వారి లీగల్‌ స్టేటస్‌లను తొలగించారన్నారు. క్యాచ్‌ అండ్‌ రివోక్‌ పేరుతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో విద్యార్థి వీసా ఉన్నవారి పరిస్థితిని ఏఐ టూల్స్‌తో రివ్యూ చేస్తారు. చివరికి వారి సోషల్‌ మీడియాను కూడా పరిశీలిస్తారు. ఈ ప్రోగ్రామ్‌ కింద దాదాపు 300 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీలు, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్‌ వాసులున్నారు. అమెరికాలో చాలామంది భారతీయులు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కింద ఉన్నారు. దీంతో వారికి తాత్కాలికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. కాగా వీటికి అనుగుణంగా తిరిగి వారి వీసాలు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement