క్షిపణి పరీక్షకు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు..
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో క్షిపణి పరీక్షకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ అప్రమత్తం అయింది. పాక్ చర్యలను భారత్ రక్షణ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. అలాగే పాకిస్థాన్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. ఇక కేబినెట్ భేటీలో సింధు జలాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ భయంతో గురు, శుక్రవారాల్లో క్షిపణి పరీక్ష చేయాలని పాక్ ఆదేశించింది. అరేబియా సముద్ర తీరంలో క్షిపణులను పరీక్షించాలని సంకేతాలు ఇచ్చింది. దీంతో భారత్ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ పరిణామాలపై నిఘా పెట్టాయి. ఇక కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తం అయింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక ఉగ్ర దాడికి నిరసనగా గురువారం కాశ్మీర్‌లో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది.