విలన్ కోసం పూరీ జగన్నాథ్ ఏం చేయనున్నారు?
టాలీవుడ్ మాస్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రీసెంట్ గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేయబోయే సినిమాను పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు పూరీ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ సాలిడ్ ఉంటుందని అంటున్నారు. దీంతో విలన్ రోల్ కోసం సాలిడ్ యాక్టర్ నే ప్రిపేర్ చేస్తున్నారట.
దీని కోసం మలయాళం యాక్టర్ ఫహాద్ ఫజిల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని పూరీ అండ్ టీమ్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆయనకు పూరీ జగన్నాథ్ ఇప్పటికే కథను కూడా వినిపించారని.. అది ఆయనకు నచ్చిందని టాక్ వినిపిస్తుంది. కానీ ఫహాద్ ఫాజిల్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. దీంతో పూరీ ఫహద్ కోసం వెయిట్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాపై పూరీ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.