మియాపూర్ లో అపార్ట్మెంట్ వాసులపై దాడికి పాల్పడిన డెలివరీ బాయ్స్

By Ravi
On
మియాపూర్ లో అపార్ట్మెంట్ వాసులపై దాడికి పాల్పడిన డెలివరీ బాయ్స్

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో జేప్టో, జొమాటో డెలివరీ బాయ్స్ హల్చల్ చేశారు. డెలివరీ కోసం వచ్చిన ఒక అబ్బాయిని మై హోమ్ జ్యువెలర్స్ అపార్ట్మెంట్ లో సరేన గుర్తింపు కార్డు లేదని నిలదీయడంతో వివాదం మొదలైంది. డెలివరీ చేసిన తర్వాత తన వాట్సాప్ గ్రూప్ ద్వారా వంద మంది బాయ్స్ ని పిలిపించి అపార్ట్మెంట్ వాసులపై దాడికి దిగారు.  మై హోమ్ జ్యువెలర్స్ అపార్ట్మెంట్ లో ఉన్న మూడు గేట్లు మూసివేసి దాడికి దిగారు. స్కూల్ నుంచి వస్తున్న విద్యార్థులు మహిళలపై తాగి అసభ్యంగా ప్రవర్తించారని మై హోమ్  వైస్ ప్రెసిడెంట్ మహేష్ తెలిపారు. అడ్డొచ్చిన అపార్ట్మెంట్ వాసులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడికి దిగిన ఆరుగురుపై కేసు నమోదు  చేసి అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గి జొమటో జెప్టో సంస్థలు డెలివరీ బాయ్స్ కి లేదా గుర్తింపు కార్డు ఇచ్చి పంపించాలేతప్ప ఎలాంటి గుర్తింపు లేని వారిని ప్రోత్సహించ కూడదని అపార్ట్మెంట్ వాసురాలు అలేఖ్య తెలిపారు. భవిష్యత్తులో గేటెడ్ కమ్యూనిటీలోనే కాకుండా రెసిడెన్షియల్ కాలనీలో కూడా ఇలాంటి ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...