ట్రంప్ సర్కార్‌పై దావా వేసిన హార్వర్డ్ యూనివర్సిటీ

By Ravi
On
ట్రంప్ సర్కార్‌పై దావా వేసిన హార్వర్డ్ యూనివర్సిటీ

అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీకి, ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ కట్ చేసింది. యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ.. ట్రంప్ సర్కార్‌పై దావా వేసింది. ప్రభుత్వం బెదిరించి నిధులను నిలిపివేసిందని పేర్కొంది. యూనివర్సిటీ ప్రతిష్టతను ట్రంప్ సర్కార్ దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా విదేశీ విద్యార్థులను కూడా బెదిరిస్తోందని దావాలో ఆరోపించింది. ఈ మేరకు మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక విషయాల్లో చాలా వేగంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన పాలనలోకి వచ్చాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఇక విదేశీ విద్యార్థులను వెళ్లగొడుతున్నారు. 

అంతేకాకుండా ఎన్నికల సమయంలో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా యూనివర్సిటీ పని చేసిందంటూ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కార్ కక్ష కట్టింది. దీంతో 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అలాగే పన్ను మినహాయింపును నిలిపివేసింది. అంతేకాకుండా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, ప్రవేశాలు, నియామక పద్ధతులు కూడా మార్చాలంటూ ట్రంప్ లెటర్ రాశారు. అయితే ట్రంప్ సర్కార్ ఆదేశాలను హార్వర్డ్ యూనివర్సిటీ తిప్పికొట్టింది. విద్యావ్యవస్థల్లో జోక్యం చేసుకోవద్దని.. మార్పులు, చేర్పులు చేసే ప్రసక్తలేదని తేల్చి చెప్పింది. ఇలా ట్రంప్ సర్కా్ర్‌పై ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించింది.

Advertisement

Latest News