కోల్‌కతా మళ్లీ ఆ తప్పులే చేస్తోంది: ఇయాన్
డిపెండింగ్ ఛాంపియన్స్ గా ఐపీఎల్ సీజన్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా టీమ్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ తో ఓటమిపాలవుతుంది. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతాకు వరుసగా ఇది రెండో ఓటమి. ఆఖరి అయిదు మ్యాచుల్లో మూడో ఓటమి. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో అయిదు ఓడిపోయాయి. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కతా తమ హోం గ్రౌండైన ఈడెన్ గార్డెన్స్‌లో తలపడిన మ్యాచుల్లోనూ తడబడుతోంది. ఇక్కడ వారి బౌలింగ్ విభాగం బాగున్నప్పటికీ, బ్యాటింగ్‌లో వైఫల్యాల వల్లే తాము ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నామని కెప్టెన్ అజింక్య రహానే ఒప్పుకున్నారు.
ఈ విషయం మీద కోల్‌కతా మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రెస్పాన్డ్ అయ్యారు. మనం కోరుకుంటున్నట్లుగా కోల్‌కతా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని బౌన్స్ బ్యాక్ కావడం లేదు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తోంది. వారు తమ బ్యాటింగ్ లైనప్‌లో కొన్ని మార్పులు చేశారు. కానీ అవి వర్కౌట్ కాలేదు అని మోర్గాన్ అన్నాడు. రహానే చేసిన కామెంట్స్ మీద కూడా ఈ మాజీ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. గుజరాత్ టైటాన్స్ చేసిన 199 పరుగుల లక్ష్యాన్ని మేం ఛేదించగలం అనుకున్నామని అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు నన్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే... ఈ పిచ్‌పై బాల్ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ ఎత్తులో వచ్చింది. ఈ కారణంగానే బౌండరీలు కొట్టడం బ్యాటర్లకు కష్టంగా మారింది అని ఇయాన్ మోర్గాన్ కామెంట్ చేశారు.