పెళ్లిరోజునే పాపకు జన్మనిచ్చిన స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్..

By Ravi
On
పెళ్లిరోజునే పాపకు జన్మనిచ్చిన స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్..

స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తాజ్వాల, కోలీవుడ్ యాక్టర్ విష్ణు విశాల్‌ తమ ఫ్యాన్స్ కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్లు సోషల్‌ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. గుత్తా జ్వాలా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విష్ణు విశాల్‌ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు పెట్టారు. ఇవాళ తమ పెళ్లి రోజు అని తెలిపారు. ఇదే రోజు తమకు ఆ దేవుడు గిఫ్ట్‌గా పాపను ఇచ్చాడని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈ రోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకోవడం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 

కాగా 2005లో చేతన్‌ ఆనంద్‌ ని ప్రేమించి పెళ్లాడిన గుత్తాజ్వాల 2011లో విడిపోయారు. అప్పటినుంచి కెరీర్‌ పైనే దృష్టిపెట్టిన గుత్తా ఆ తర్వాత తమిళ హీరో విష్ణువిశాల్‌ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2021 ఏప్రిల్‌ 22న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఆర్యన్‌ ఉన్నాడు. ప్రస్తుతం ఆర్యన్‌ విష్ణు విశాల్‌ దగ్గరే పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్