వెస్ట్ బెంగాల్ టీచర్లకు ఊరట..
వెస్ట్ బెంగాల్ టీచర్స్ కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఉద్యోగుల్ని నియమించేంత వరకు టీచర్లుగా ఉండవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ తీర్పుతో వారికి ఉపశమనం లభించింది. రీసెంట్ గా 25 వేల టీచర్ పోస్టుల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు తెలిపింది. నియామకాల్లో కొన్ని అవతవకలు జరిగాయని న్యాయస్థానం తెలిపింది. దీంతో 25 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో బాధితులు నడిరోడ్డున పడ్డారు.
తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. ఇక ప్రభుత్వం కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాజా తీర్పుతో టీచర్లకు ఊరట లభించింది. ఇక డిసెంబర్ నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు. అప్పటి వరకు పాత టీచర్లు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఇక మే 31 నుంచి డిసెంబర్ 31 వరకు కొత్త నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.