ఆ కామెంట్స్ పై సీరియస్ అయిన ఏఆర్ రెహమాన్..
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ లాంగ్వేజ్ లో వర్క్ చేశారు. బాలీవుడ్ లోనూ ఆయన మ్యూజిక్ కి మంచి డిమాండ్ ఉంది. అలాంటిది రీసెంట్ గా పాపులర్ సింగర్ అభిజిత్.. ప్రజంట్ మ్యూజిక్ ఫీల్డ్ లో వస్తున్న ఛేంజెస్ పై మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ వర్కింగ్ స్టైల్స్ పై కామెంట్స్ చేశారు. రెహమాన్ ఎక్కువగా సింగర్స్ కి బదులుగా టెక్నాలజీని ఉపయోగించి మ్యూజిక్ ను కంపోజ్ చేస్తున్నారని, దీని వల్ల చాలామందికి ఉపాధి లేకుండా పోతుందని కామెంట్ చేశారు. రీసెంట్ గా ఈ కామెంట్స్ కి ఏఆర్ రెహమాన్ రెస్పాన్డ్ అయ్యారు. అభిజీత్ నాపై ఎలాంటి విమర్శలు చేసినా.. ఆయన్ని గౌరవిస్తూనే ఉంటాను.
ఎందుకంటే ఆయనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. కానీ దుబాయ్ వేదికగా రీసెంట్ గా ఒక మహిళా ఆర్కెస్ట్రా బృందాన్ని సిద్ధం చేశా. అందులో సుమారు 60 మంది మహిళలు ఉన్నారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి నెలా జీతం ఇస్తూ, వాళ్ల కోసం ఆరోగ్య, జీవిత బీమా కడుతున్నా అంతేకాకుండా పొన్నియిన్ సెల్వన్, ఛావా వంటి సినిమాల కోసం వర్క్ చేసినప్పుడు, సుమారు 200 మంది సంగీతకారులను అందులో భాగం చేశా. కొన్నిసార్లు కేవలం పాటల కోసమే 100 మందికి పైగా వర్క్ చేస్తుంటారు. ఆ విషయాలను నేను ఎక్కడ బయట పెట్టను. అలాగే దానికి సంబందించిన ఫోటోలను పంచుకోను. అందుకే ఎవరికీ నా వర్కింగ్ స్టైల్ గురించి పెద్దగా అవగాహన ఉండదు అని ఆయన వివరణ ఇచ్చారు.