పూరీ, సేతుపతి ప్రాజెక్ట్ లో టబు.. అఫీషియల్

By Ravi
On
పూరీ, సేతుపతి ప్రాజెక్ట్ లో టబు.. అఫీషియల్

పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు ఆయన సినిమాలంటే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ హిట్స్ ని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అందించారు. కానీ గత కొన్నాళ్లుగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్న నెక్ట్స్ బిగ్గెస్ట్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఛార్మి కౌర్ ప్రొడ్యూసర్ గా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో టబూ లేదా రవినా టాండన్, ఇద్దరిలో ఒకరు కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

అయితే, ఎట్టకేలకు టబూ ఫిక్స్ అయింది. ఆ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తూ, పూరి జగన్నాథ్, ఛార్మితో కలిసి టబూతో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ చెప్పిన లైన్ విని సేతుపతి బాగా ఎక్సైట్ అయ్యాడని, ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో టబూ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ మంచి కంబ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

Latest News

అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..! అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
హైదరాబాద్ TPN : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు సికింద్రాబాద్‌ ప్యారడైజ్ కూడలి...
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫైర్‌..!
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ..! రూ.562 కోట్ల పెట్టుబడులు..!
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్..!