ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?

By Ravi
On
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?

40 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ సమయంలో మాజీ నక్సలైట్, ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, పలు దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములపై.. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కన్నేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ భూములను స్వాధీనం చేసుకును ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. అలాంటి చర్యలు మానుకొని సాగుచేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. నక్సలైట్ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన దూసి అప్పలస్వామికి, మరో ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, మరో మూడు దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన నాలుగున్నర ఎకరాల భూమి పక్కన.. ఎమ్మెల్యే ఎంజీఆర్‌ భూమి కొనడం.. ఆ పక్కనే ఉన్న వీరి పొలాలు కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారం ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. ల్యాండ్ సీలింగ్‌లో పేదలకు భూములు ఇవ్వడం ప్రధాన ఉద్దేశమని, ఆ విధంగా వచ్చిన భూములను ఎమ్మెల్యే స్వాధీనపరుచుకోవాలని చూడడం సరికాదన్నారు. ఈ భూములపైనే గిరిజన, దళిత రైతులు జీవనం సాగిస్తున్నారని.. వారి సాగులో ఉన్న భూములకు హక్కులను కల్పించి, పాసు పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాటి అలాట్మెంట్ రికార్డుల్లో ఈ బాధిత రైతుల పేర్లే ఉన్నాయన్నారు. ఇప్పుడు అవి ఎవరివో తెలియాలంటే రికార్డులు పరిశీలించాలని.. కొత్త నాటకాలు ఆడడం అధికారులకు సమంజసం కాదని, ఈ విషయం మీద ఆర్డీవోని సంప్రదించడం జరిగిందని.. ఈ రైతులకు న్యాయం జరగకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!