ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
అన్నగారిన బడుగు బలహీన వర్గాలకు జ్ఞానజ్యోతిని వెలిగించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి లో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ SC కార్యదర్శి మెండెం జమలయ్య ఆధ్వర్యంలోరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలతో కలిసి మనం ఈరోజు అగ్రవర్ణాలతో కలిసి సమవుజ్జిగా నడుస్తున్నామంటే కేవలం ఆయన రూపొందించిన రాజ్యాంగమే, న్యాయ నిర్దేశ మంత్రిగా పనిచేసి అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు అంటరానితనాన్ని పారతోలి మనుషులంతా ఒకటే అంటూ ప్రతి ఒక్క మనిషికి ఎటువంటి హక్కులు కలిగి ఉండాలో సకల జాతులకు ఏ బలహీన వర్గాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి అనే దిశ నిర్దేశాలను కల్పించి బడుగు బలహీన వర్గాలకు సకల హక్కులను కల్పించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు పూల మాలలు వేసి ఘనమైన నివాళులర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ వైస్ ప్రెసిడెంట్ వేములకొండ నాగరాజు, మాజీ పార్టీ ప్రెసిడెంట్ కొత్తపల్లి పూర్ణ M నాగరాజు,తెలుగు యువత ఉప్పలపాటి వెంకట్రావు, గ్రామ వార్డ్ మెంబెర్స్ రామోజీ, దుర్గారావు,k పూర్ణ,రైతు నాయకులు సుధాకర్,సరే వెంకటనారాయణ,స్థానిక దళిత నాయకులు కొసనం జోజి, గొడవర్తి చంటి, మెండెం రాజీవ్,బాబు, ప్రసన్న, తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు