రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత

By Ravi
On
రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత

image (13)ఎక్సైజ్ శాఖ మరియు ఎస్.టి.ఎఫ్. టీములు సంయుక్తంగా నాలుగు ప్రదేశాల్లో దాడులు నిర్వహించి రూ. 60 లక్షల విలువగల 75.262 కేజీల గంజాయి, చెరస్, వాహనాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఖమ్మం: 51.27 కేజీల గంజాయి స్వాధీనం

ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని పూణేకు తరలిస్తున్న 51.27 కేజీల గంజాయిను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఓ కారు కూడా సీజ్ చేశారు. ఈ సమాచారాన్ని అసిస్టెంట్ కమిషనర్ గణేష్ వెల్లడించారు.

హైదరాబాద్ దూల్‌పేట్ వద్ద పట్టివేత

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తెచ్చిన 21.48 కేజీల గంజాయిను దూల్‌పేట్‌కు తరలిస్తుండగా ఎస్.టి.ఎఫ్. ఏ టీం పట్టుకుంది. నిందితులు చందర్‌పాల్ సింగ్ మరియు అతని భార్య గాయత్రి భాయ్. వారిని ద్విచక్ర వాహనంపై తరలిస్తూ పట్టుకున్నారు. ఈ కేసులో మరో 13 మందిపై కూడా కేసులు నమోదు చేశారు.

చెరస్, చిన్న పరిమాణ గంజాయి పట్టివేత

ఎస్.టి.ఎఫ్. బీ టీం రెండు కేసుల్లో 2.51 కేజీల గంజాయి, 2.42 గ్రాముల చెరస్ స్వాధీనం చేసింది. సీఐ భిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజులు బృందం ఈ దాడుల్లో పాల్గొన్నారు.

ఖైరతాబాద్ – 1.26 కేజీల గంజాయి, చెరస్

ఆకాశ్ అనే వ్యక్తి నుంచి 1.26 కేజీల గంజాయి, 2.42 గ్రాముల చెరస్ స్వాధీనం చేసి ఖైరతాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

బాలానగర్ – స్కూటీపై గంజాయి తరలింపు

పవన్ కళ్యాణ్, పృథ్వీ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న 1.252 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు.

మొత్తం నాలుగు కేసుల్లో గంజాయి, చెరస్, వాహనాలు, సెల్‌ఫోన్లు కలిపి రూ. 60 లక్షల విలువగల సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులను విజయవంతంగా చేధించిన ఖమ్మం పోలీసులు, ఎస్టిఎఫ్ టీములను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి అభినందించారు.ప్రజలు, యువత గంజాయి వంటి మత్తు పదార్థాల దూరంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Latest News

కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..! కరన్‌కోట్‌ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం..!
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్‌కోట్ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు, పొగలు ఎగసిపడతున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బ్యాంకు సిబ్బంది...
వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు..!
వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
తెగి పడ్డ హైటెన్షన్ వైర్.. చాదర్ ఘాట్ లో భారీగా ట్రాఫిక్ జామ్..!
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!