మేజర్ సందీప్ తన కర్తవ్యం నిర్వర్తించాడు

By Ravi
On
మేజర్ సందీప్ తన కర్తవ్యం నిర్వర్తించాడు

ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడులు ఏ భారతీయుడు మర్చిపోలేరు. ఈ దుర్ఘటనలో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు తాజ్ హోటల్ తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవుర్ హుస్సేన్ రాణా ముఖ్య పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, కాసేపట్లో అతడ్ని అమెరికా నుంచి భారత్‌కు తీసుకు రానున్నారు. కాగా, ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. 

అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక, నా కొడుకు సందీప్ 26/11 బాధితుడు కాదు, అది అతడి కర్తవ్యం అన్నారు. తహావుర్ రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణం, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలి, న్యాయం కోసం ఎదురు చూస్తున్నానని, బాధితులందరికీ ఇది ఒక ఆశా కిరణం అని పేర్కొన్నారు. కాగా భారత్ కు ముంబై ఉగ్రవాదుల నిందితుడు తహావూర్ రాణాను అప్పగించారు.

Advertisement

Latest News

ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..? ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!