వీర హనుమాన్ విజయయాత్ర - బైక్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి...

By Ravi
On
వీర హనుమాన్ విజయయాత్ర - బైక్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి...

హైదరాబాద్:  వీర హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయ యాత్ర సన్నాహక సమావేశం విశ్వహిందూ పరిషత్  బజరంగ్ దళ్  కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

చారిత్రాత్మకమైనటువంటి కర్మన్ఘాట్ హనుమాన్ మందిరం నుండి వీర హనుమాన్ విజయ యాత్రను శోభాయ మానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ప్రతి ఇంటి నుండి ఒక యువకుడు శోభాయాత్రకు తరలివచ్చేలా స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేశామని యాత్రలో లక్షలాదిమంది బైకు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు కూడా లక్షలాదిగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రసాద వితరణ, మంచినీటి ఏర్పాట్లు చేసామని తెలిపారు. 

బైక్ ర్యాలీ ఉదయం 8 గంటలకు కర్మాంఘాట్ హనుమాన్ దేవాలయం నుండి కోటి మీదుగా తాడ్ బంద్ వీర హనుమాన్ దేవాలయం వరకు  పాల్గొనాలని తెలిపారు. పోలీసు శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  కట్టుదట్టమైన ఏర్పాట్లు చేశారని, శోభాయాత్ర సాగే ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసి, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

WhatsApp Image 2025-04-09 at 6.01.43 AM (1)

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!