కాగ్న వాగు నుండి జోరుగా ఇసుక అక్రమ రవాణా..

By Ravi
On
కాగ్న వాగు నుండి జోరుగా ఇసుక అక్రమ రవాణా..

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఇసుక అక్రమ రవాణా తార స్థాయికి చేరింది. కొకట్ కాగ్నా నది నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా కరువైందని పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో 3 పర్మిట్లు ఆరు ట్రిప్పులు అన్న  చంద్రంగా కొనసాగుతుంది. రోజుకు కనీసం సుమారు 20 నుండి 30 ట్రాక్టర్ల పైగా తరలిస్తున్నా కేవలం 10 ట్రాక్టర్ లకు మాత్రమే పర్మిట్ లుఉన్నాయి పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుక రవాణా పర్మిట్... 
ఇసుక డంపింగ్ చేసేందుకు ఒకచోటకు పర్మిషన్ తీసుకొని మరొక్కచోట ప్రయివేట్ స్థలాలకు తరలిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక పర్మిషన్ ఉన్నప్పటికీ, ఉదయం 6 గంటల నుండి మొదలు పెట్టి షురూ చేస్తే అర్ధరాత్రి అయిన కూడా ట్రిప్ పైన ట్రిప్ కొడ్తూన్నా ఇసుక అక్రమార్కులు. ఒక్క ట్రాక్టర్ కి 2 నుండి 3 ట్రిపులు ఉంటే 9 నుండి 10 ట్రిపులు కొడుతూ కొనసాగిస్తున్నారు.

ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై బల ప్రయోగానికి వెనుకాడటం లేదని తెలుస్తుంది. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేయడం చట్ట విరుద్ధం అని తెలిసిన ఇసుకాసురులు మాత్రం ఇవేవీ తమకు పట్టవు అన్నట్టుగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ప్రభుత్వ సంబంధిత అభివృద్ధి పనుల పైన సీసీ రోడ్లు డ్రైనేజీలు కల్వర్టులు తదితర ప్రభుత్వ పనులకు నది నుంచి ఇసుకను తరలించేందుకు వీలుగా కల్పించిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తున్నట్ల కనిపిస్తుంది. 

మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా పై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇసుకసురులు రెచ్చిపోయి అక్రమ ఇసుక రవాణా యధేచ్చగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఇసుకసురులపై ఉక్కు పాదం మోపి వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ముఖ్యంగా మంగళవారం యాలాల మండలం  కోకట్ కాగ్నా నది నుండి ఇసుక ట్రాక్టర్లు అతివేగంతో వెళ్తున్నాయని కోకట్ గ్రామస్తులు ట్రాక్టర్ డ్రైవర్లను ఆపి వేగంతో వెళ్లకండి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి అని చెప్పడంతో ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామస్తుల పట్ల దురుసుగా  ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దింతో ఇసుక ట్రాక్టర్ లు 2 గంటల పాటు నడి రోడ్డు పై నిల్చుండిపోయాయి.

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!