షారూఖ్ కూతురికి తల్లిగా దీపిక?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొణె తన టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 2007 లో ఓం శాంతి ఓం అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ టైమ్ లోనే తన అందం, అభినయంతో కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ లో అత్యదిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా మారారు. క్యారెక్టర్ కోసం తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ను అందించే ఈ బ్యూటీ ప్రజంట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. లేటెస్ట్ కల్కి 2898 ఏడీ మూవీలో దీపికా యాక్ట్ చేసి సౌత్ ఇండియా ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేశారు. ఇక దీపికా షారుఖ్ ఖాన్ తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్స్ లో యాక్ట్ చేశారు.
స్పెషల్లీ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎంటర్ టైన్ చేశారు. ఇప్పుడు మరోసారి ఈ కపుల్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. షారుఖ్ ఖాన్ కూతరు సుహానా ఖాన్ మెయిన్ లీడ్ గా వస్తున్న కింగ్ మూవీలో ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ వహిస్తున్నారు. సో ఈ సినిమాలో దీపిక స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నారు. అది కూడా సుహానాకు తల్లి పాత్రలో సెలెక్ట్ చేశారు. స్టోరీ నచ్చడంతో దీపికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అఫిషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి.